Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరుగుల సునామీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బద్దలు కొట్టిన రికార్డుల లిస్ట్ ఇదే

List of all records broken in Sunrisers Hyderabad Vs Delhi Capitals match in IPL 2024 clash
Advertisement
  • 266 భారీ స్కోరుతో పలు రికార్డులు బద్దలు కొట్టిన సన్‌రైజర్స్
  • విధ్వంసం సృష్టించిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
  • పవర్‌ప్లేలో అత్యధిక స్కోరుతో పాటు పలు రికార్డులు బ్రేక్
Advertisement
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లకు సన్‌రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాలను మోతెక్కిస్తున్నారు. ఈ సీజన్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్లను నమోదు చేసిన ఆ జట్టు తాజాగా మరో భారీ స్కోరు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలి బ్యాటింగ్ చేసి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పరుగుల సునామీ సృష్టించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ 67 పరుగుల తేడాతో గెలిచింది. అయితే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి.

పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు
గత మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 46 పరుగులు కొట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 38 బంతుల్లోనే 131 పరుగులు జోడించారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నిలిపారు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా తొలి 100 పరుగులు
1. ఢిల్లీపై సన్‌రైజర్స్ - 5 ఓవర్లు (శనివారం రాత్రి)
2. పంజాబ్‌పై చెన్నై - 6 ఓవర్లు (2014)
3. ఆర్సీబీపై కోల్‌కతా - 6 ఓవర్లు (2017)
4. ముంబైపై సీఎస్కే - 6.5 ఓవర్లు (2015)
5. ముంబైపై సన్‌రైజర్స్ - 7 ఓవర్లు (2024)

సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధ శతకాలు
1. ముంబైపై అభిషేక్ శర్మ - 16 బంతులు (2024)
2. ఢిల్లీపై ట్రావిస్ హెడ్ - 16 బంతులు ( శనివారం రాత్రి)
3. ముంబైపై ట్రావిస్ హెడ్ - 18 బంతులు (2024)
4. సీఎస్కేపై డేవిడ్ వార్నర్ - 20 బంతులు (2015)
5. కోల్‌కతాపై డేవిడ్ వార్నర్ - 20 బంతులు (2017)

ఐపీఎల్ పవర్‌ప్లే అత్యధిక 50+ స్కోర్లు
1. డేవిడ్ వార్నర్ - 6 
2. క్రిస్ గేల్ - 3
3. సునీల్ నరైన్ - 3
4. ట్రావిస్ హెడ్ -3

ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
1. ఆర్సీబీపై సన్‌రైజర్స్ - 22 (2024)
2. ఢిల్లీపై సన్‌రైజర్స్ - 22 (శనివారం రాత్రి)
3. పుణేపై ఆర్సీబీ -21 (2013)
4. గుజరాత్ లయన్స్‌పై ఆర్సీబీ - 20 (2016)
5. గుజరాత్ లయన్స్‌పై ఢిల్లీ - 20 (2017)
6. సన్‌రైజర్స్‌పై ముంబై - 20 (2024)

ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు
1. ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ - 81 (2024)
2. సన్‌రైజర్స్ వర్సెస్ ఢిల్లీ - 71  (శనివారం రాత్రి)
3. సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై - 69 (2024)
4. సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ - 69 (2010). 

పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు
1. ఢిల్లీపై ట్రావిస్ హెడ్ - 84 (26) (శనివారం రాత్రి)
2. కోల్‌కతాపై - డేవిడ్ వార్నర్ - 62*(25) -(2019)
3. ముంబైపై ట్రావిస్ హెడ్ - 59*(20) -( 2024)
4. సీఎస్కేపై డేవిడ్ వార్నర్ - 59*(23) (2015)

ఐపీఎల్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు
1. ఢిల్లీపై సన్‌రైజర్స్ - 125/0 (శనివారం రాత్రి)
2. ఆర్సీబీపై కోల్‌కతా - 105/0 (2017)
3. పంజాబ్‌పై సీఎస్కే - 100/2 (2014)
4. ముంబైపై సీఎస్కే - 90/0 (2015)
5. ఢిల్లీపై కోల్‌కతా - 88/1 (2024)
6. సన్‌రైజర్స్‌పై ఢిల్లీ - 88/2 (శనివారం రాత్రి)

ఐపీఎల్‌లో తొలి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు
1. ఢిల్లీపై సన్‌రైజర్స్ - 158/4 (శనివారం రాత్రి)
2. ముంబైపై సన్‌రైజర్స్ - 148/2 ( 2024)
3. సన్‌రైజర్స్‌పై ముంబై - 141/2 (2024)
4. ఢిల్లీపై కోల్‌కతా - 135/1 (2024)

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 స్కోరు
1. పంజాబ్‌పై ఆర్సీబీ - 14.1 ఓవర్లు (2016)
2. ముంబైపై సన్‌రైజర్స్ - 14.4 ఓవర్లు (2024)
3. ఢిల్లీపై సన్‌రైజర్స్ - 14.5 ఓవర్లు ( శనివారం రాత్రి)
4. ఆర్సీబీపై సన్‌రైజర్స్ - 14.6 ఓవర్లు (2024)
5. ఢిల్లీపై కోల్‌కతా - 15.2 ఓవర్లు (2024)

ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో ఎక్కువసార్లు 250+ స్కోర్లు
1. సర్రే - 3 సార్లు
2. సన్‌రైజర్స్ హైదరాబాద్ - 3 సార్లు
3. సోమర్‌సెట్ - 2 సార్లు
4. యార్క్‌షైర్ - 2 సార్లు
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 2 సార్లు
Advertisement
Advertisement
Sunrisers Hyderabad
Delhi Capitals
IPL 2024
SRH vs DC
Cricket

More Telugu News